: ఫ్లాట్ రాసివ్వకుంటే దూకి చస్తా!... పీటర్ ముఖర్జియాను బ్లాక్ మెయిల్ చేసిన ఇంద్రాణీ


కడుపున పుట్టిన కూతురును కడతేర్చిన కసాయి తల్లి ఇంద్రాణీ ముఖర్జియా కేసులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన షీనా బోరా హత్య కేసుకు సంబంధించి ఇంద్రాణీ భర్త, స్టార్ టీవీ మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ఇప్పటికే పలు విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. తాజాగా తన అందచందాలతో పీటర్ ను బుట్టలో పడేసిన ఇంద్రాణీ, ఆస్తి కోసం ఆయననే బ్లాక్ మెయిల్ చేసిందట. 2004లో పీటర్ స్టార్ టీవీ సీఈఓగా ఉండగా, ఇంద్రాణి ఐఎన్ఎక్స్ సర్వీసెస్ పేరిట ఓ సొంత కంపెనీ నడిపింది. ఆ సమయంలో ముంబైలోని మార్లో అపార్ట్ మెంటులోని ఫ్లాట్ నెంబరు 18లో వారు ఉండేవారు. సదరు ఫ్లాట్ పీటర్ పేరిట ఉండగా, అందులో సగం వాటాను తన పేరిట రాయాలని, లేకపోతే నాలుగో అంతస్తు నుంచి దూకి చస్తానని ఇంద్రాణీ బ్లాక్ మెయిల్ చేసిందట. దీంతో ఆమె వేధింపులు తాళలేక సదరు ఫ్లాట్ లో సగాన్ని ఆమె పేరిట రాసేశానని పీటర్ పోలీసులకు తెలిపారు. అంతేకాక ఆస్తి, ఇతర విషయాల్లో తరచూ తమ మధ్య గొడవలు జరిగేవని కూడా పీటర్ విచారణలో సీబీఐ అధికారులకు చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనం రాసింది.

  • Loading...

More Telugu News