: మేం తిరగబడితే పోలీసులకు రెస్ట్ ఉండదు: దానం నాగేందర్
తాము తిరగబడితే తెలంగాణలో పోలీసులకు రెస్ట్ ఉండదని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తే చంపుతామని వచ్చిన బెదిరింపుని తేలిగ్గా తీసుకునే ప్రయత్నం చేయవద్దని పోలీసులకు సూచించారు. షబ్బీర్ అలీకి వచ్చిన బెదిరింపులు చూస్తే చాలు, రాష్ట్రంలో అధికార పక్షం తీరుతెన్నులు తెలిసిపోతాయని ఆయన పేర్కొన్నారు. దీనిని సీరియస్ గా తీసుకుని పోలీసులు పని చేయాలని ఆయన తెలిపారు. లేని పక్షంలో తాము తిరగబడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. తాము తిరగబడడం అంటూ మొదలైతే పోలీసులకు కనీసం రెస్టు కూడా దొరకదని ఆయన హెచ్చరించారు.