: హృతిక్ రోషన్ గొప్పతనాన్ని వెల్లడించిన అల్లు అర్జున్
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చెన్నై బాధితులకు 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. చెన్నై వరద బాధితులకు విరాళం ప్రకటించిన తొలి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కావడం విశేషం. వరదల సమయంలో టాలీవుడ్ నటులంతా సంఘంగా ఏర్పడ్డారని తెలుసుకున్న హృతిక్ నేరుగా నవదీప్ కు ఫోన్ చేసి అభినందించాడు. తాను చేయగలిగినది ఏదైనా ఉందా? అని అడిగాడు. 'మీకు చేతనైన సహాయం చేయండి, నేను మీకు అండగా ఉంటా'నని తెలిపాడు. తాజాగా 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడంపై టాలీవుడ్ మొత్తం హృతిక్ ను అభినందనల్లో ముంచెత్తుతోంది. కాగా, తాను 25 లక్షల విరాళం ఇచ్చిన విషయాన్ని హృతిక్ ప్రకటించకపోవడం విశేషం. ఈ విషయాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించాడు.