: ప్రభుత్వం కోసం చూడొద్దు...మనల్ని మనమే రక్షించుకుందాం: సినీ నటుడు కార్తీ పిలుపు
చెన్నైలోని స్ట్రీట్ క్లీన్ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు కార్తీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు వీధులను అభిమానులు, స్నేహితులతో కలిసి కార్తీ శుభ్రం చేశాడు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ, మన నగరాన్ని మనమే శుభ్రం చేసుకోవాలని సూచించాడు. రోడ్లపై నిలిచిన నీరు తొలగిపోవడంతో అంతా వీధులను శుభ్రం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చాడు. ప్రభుత్వం వచ్చి శుభ్రం చేస్తుందని అలోచిస్తూ కూర్చోకూడదని, మనకు చేతనైనంత మనం చేయాలని కార్తీ తెలిపాడు. ముఖ్యంగా యువతరం వీధులను శుభ్రం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, అంతా 'క్లీన్ చెన్నై' కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేపట్టి వీధులను శుభ్రం చేయాలని కోరాడు. లేని పక్షంలో అంటురోగాలు చుట్టుముట్టి, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలని కార్తీ సూచించాడు.