: ఢిల్లీలో తొలి 'సౌర విద్యుత్తు' స్కూలు


ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్ లోని ప్రభుత్వ పాఠశాలను తొలి సోలార్ పవర్ గ్రీన్ స్కూల్ గా ప్రకటించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయంలో ఉన్న ఈ స్కూలుకు అవసరమయ్యే విద్యుత్తును సోలార్, గ్రీన్ టెక్నాలజీస్ ద్వారా అందజేయనున్నారు. ఇదే పాఠశాలలో రాష్ట్రపతి ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులకు పాఠాలు బోధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పూర్తి సౌరశక్తితో నడిపేందుకు సన్నాహాలు చేశామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పుట్టిన రోజును పురస్కరించుకుని విద్యార్థులు పలు శాస్త్రసాంకేతిక మోడల్స్, పెయింటింగ్స్ ప్రదర్శించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News