: విజయ్ కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు: డీఎండీకే
ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వాటిపై డీఎండీకే పార్టీ వివరణ ఇస్తూ అవన్నీ పుకార్లని చెప్పింది. వాటిని నమ్మవద్దని స్పష్టం చేసింది. వరదల్లో మునిగిపోయిన చెన్నై, కడలూరు, కాంచీపురం, తిరువల్లూరులో బాధితులను పరామర్శించారని, ఈ సందర్భంగా విశ్రాంతి లేకపోవడంతో ఆయన జ్వరం బారినపడ్డారని డీఎండీకే తెలిపింది. ఇప్పుడాయన కోలుకున్నారని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆ పార్టీ వివరణ ఇచ్చింది.