: హెచ్ఓడీలు మమ్మల్ని వేధిస్తున్నారు: ‘ఉస్మానియా’ హౌస్ సర్జన్లు ఫిర్యాదు
హెచ్ఓడీ లు తమను వేధిస్తున్నారంటూ ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన హౌస్ సర్జన్లు ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత మంత్రికి ఫిర్యాదు చేశారు. హెచ్ఓడీలు డాక్టరు బాబూరావు, డాక్టరు శ్రీధర్ తమను వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లతో తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. హౌస్ సర్జన్లు చేసిన ఫిర్యాదుపై ఈ కమిటీ విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చనుంది.