: వకార్ ను మార్చండి... లేకపోతే పాక్ క్రికెట్ దిగజారుతుంది: మహ్మద్ యూసఫ్


పాకిస్థాన్ క్రికెట్ నానాటికీ దిగజారుతోందని... దేశీయ కోచ్ ను వెంటనే తొలగించక పోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని పాక్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ అన్నాడు. ప్రస్తుతం పాక్ కోచ్ గా వ్యవహరిస్తున్న వకార్ యూనిస్ ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో పాక్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో యూసఫ్ ఈ విధంగా స్పందించాడు. రానున్న ఏడాదిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో బిజీ షెడ్యూల్ ఉన్న తరుణంలో విదేశీ కోచ్ పై పీసీబీ దృష్టి సారించాలని సూచించాడు. దివంగత కోచ్ బాబ్ వూమర్ లాంటి కోచ్ అయితే చాలా బాగుంటుందని చెప్పాడు. పాక్ క్రికెట్ ను వూమర్ ఎంతో మెరుగు పరిచాడనే విషయాన్ని గుర్తు చేశాడు.

  • Loading...

More Telugu News