: సినీ నటులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం: కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జనవరి మూడో వారంలో జరిగే అవకాశం ఉందని టీఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాల్సి ఉందని... దీని కోసం సినీ నటులు, ఇతర ప్రముఖులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కేటీఆర్ మాటలను వింటుంటే... గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సిద్ధమయినట్టు అర్థమవుతోంది.