: ప్రలోభాలతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోంది: జగ్గారెడ్డి


తెలంగాణలో పలు జిల్లాలలో ఇతర పార్టీల అభ్యర్థులను ఉపసంహరించుకునేలా చేసి తమ అభ్యర్థుల గెలుపును ఏకగ్రీవం చేసుకుంటున్న టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. మెదక్ లో తమ పార్టీకే మెజారిటీ ఉందని, కానీ ఇక్కడి తమ అభ్యర్థి టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగాడని తెలిపారు. ఓటమి భయంతో తమ అభ్యర్థితో విత్ డ్రా చేయించిందని చెప్పారు. అధికారం ఉందనే అహంతో అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని, ప్రలోభాలతో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. గెలుస్తామన్న నమ్మకంతోనే పోటీ పెట్టామని, కానీ ఇప్పుడు పార్టీ హైకమాండ్ కు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News