: నరసరావుపేట అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారు: చంద్రబాబు
నరసరావుపేటలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1915లో ఏర్పడిన నరసరావుపేట మున్సిపాలిటీ ఈ ఏడాదితో వంద సంత్సరాలను పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. నరసరావుపేట అభివృద్ధికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని కోడెల ప్రారంభించారని కొనియాడారు. నరసరావుపేట నియోజకవర్గంలో 11,500 మరుగుదొడ్లను నిర్మిస్తామని చెప్పారు. నూతన అధ్యాయానికి నాంది పలికిన కోడెలను అభినందిస్తున్నానని అన్నారు. అన్ని మతాలకు సంప్రదాయాల ప్రకారం శ్మశానాలను నిర్మించామని చెప్పారు. తెలుగు రాష్ట్రానికి తొలి స్పీకర్, నవ్యాంధ్రకు తొలి స్పీకర్ ఇద్దరూ నరసరావుపేట నుంచే వచ్చారని గుర్తు చేశారు. తెలుగువారు గర్వపడేలా అమరావతిని నిర్మించుకుందామని చెప్పారు.