: పది రోజులు...వెయ్యికి పైగా ఉద్యోగాలు...ఖరగ్ పూర్ ఐఐటీ రికార్డ్


ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు రికార్డు స్థాయిలో అవకాశాలు సాధించుకున్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్లు ప్రారంభించిన పది రోజుల్లోనే వెయ్యి మందికి పైగా విద్యార్థులు విజయం సాధించారు. ఖరగ్ పూర్ ఐఐటీలో డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన మొదటి దశ ఇంటర్వ్యూల్లో ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, హ్యూమన్ రీసోర్సెస్ విభాగాల్లో 1100 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. గతేడాది వెయ్యి ఉద్యోగాలు సంపాదించేందుకు 20 రోజులు పట్టగా, ఈ ఏడాది కేవలం పది రోజుల్లోనే ఆ రికార్డును అధిగమించడం విశేషం. విద్యార్థులు ఉన్నత స్థానాలు సాధించడంతో క్యాంపస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

  • Loading...

More Telugu News