: నరసరావుపేట శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన చంద్రబాబు... పలువురు ప్రముఖులకు సన్మానం


గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 1915లో ఏర్పడిన నరసరావుపేట పురపాలక సంఘం ఈ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తదితరులను చంద్రబాబు సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఏపీ మంత్రులు, రాజకీయనాయకులు, పురప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News