: హోండా కార్లలో ఫ్యూయల్ రిటర్న్ పైప్ లోపాలు... రీకాల్!
ఇండియాలో రెండవ అతిపెద్ద కార్ల మార్కెటింగ్ సంస్థగా ఉన్న హోండా, 90 వేలకు పైగా కార్లను రీకాల్ చేసింది. ఫ్యూయల్ రిటర్న్ పైపుల్లో లోపాలున్న కారణంగా వీటిని రీకాల్ చేసినట్టు ప్రకటించగా, వీటిలో అత్యధికం 'హోండా సిటీ'లు ఉన్నాయి. డిసెంబర్ 2013 నుంచి జూలై 2015 మధ్య హోండా అమ్మిన 64,428 డీజిల్ హోండా సిటీ కార్లు, ఆపై జూన్ 2014 నుంచి జూలై 2015 మధ్య విక్రయించిన 25,782 మొబీలియో వేరియంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్లలో కొన్నింటిలో ఇంధనం లీక్ అవుతూ, ఇంజన్ అకస్మాత్తుగా ఆగిపోతున్నదని గమనించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, హోండా గత సెప్టెంబర్ నెలలో సిటీ, సివిక్, జాజ్, సీఆర్-వీ తదితర మోడళ్లకు చెందిన 2,23,578 కార్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.