: హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన విద్యార్థుల అరెస్ట్
కొన్ని విద్యార్థి సంఘాలు 10వ తేదీన (నిన్న) బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించినప్పటి నుంచీ ఉస్మానియా యూనివర్శిటీలో వాతావరణం వేడెక్కింది. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలో పెద్ద కూర పండుగను యూనివర్శిటీలో నిర్వహించరాదంటూ కోర్టు స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చింది. అయితే కొందరు విద్యార్థులు కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఫొటోలను కూడా సోషల్ మీడియాలో ఉంచారు. ఈ నేపథ్యంలో, బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహించిన 12 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.