: కల్తీ మద్యం కేసులో స్వర్ణ బార్ యాజమాని అరెస్టు... మద్యంలో కల్తీ జరిగినట్టు వెల్లడి
విజయవాడ కల్తీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో స్వర్ణ బార్ యజమాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడైన శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ప్రశ్నించగా, మద్యంలో కల్తీ చేసినట్టుగా వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. బార్ మేనేజర్ వెంకటేశ్వరరావు మద్యం సీసాల్లో ఏదో కలుపుతున్నట్టు గుర్తించానని ఆయన చెప్పినట్టు, అధిక లాభం కోసమే ఇలా చేసినట్టు తమ విచారణలో తెలిపినట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు పోలీసులకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. మద్యంలో ఓ రసాయనం కలసినట్టు నివేదికలో వెల్లడించారు.