: ఒక్కొక్కళ్లు రెండేసి కార్లు కొంటే ఏం చేస్తారు?: ఢిల్లీ ప్రభుత్వానికి గ్రీన్ ట్రైబ్యునల్ ప్రశ్న
వాహన కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి సరి, బేసి సంఖ్యల విధానం ప్రారంభించనుంది. దీంతో దేశ రాజధానిలో రోజూ సగం వాహనాలు మాత్రమే రోడ్డెక్కుతాయి. దీనిపై గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. విధానం బాగున్నప్పటికీ ప్రజలు రెండేసి కార్లు కొంటే అప్పుడేం చేస్తారని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే కుటుంబం సరి, బేసి సంఖ్యలున్న కార్లు కొనడం మొదలు పెడితే ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యం చేరుకోవడం సంగతి అటుంచి, కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని గ్రీన్ ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మరింత సమగ్రమైన ప్రణాళిక అవసరమని గ్రీన్ ట్రైబ్యునల్ చాలా కాలంగా హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.