: మరో వివాదంలో తారా చౌదరి... వదినపై దాడి ఘటనలో కేసు నమోదు
సినీ నటి తారా చౌదరి మరోసారి వివాదంలో చిక్కుకుంది. వదిన కవితపై దాడి ఘటనలో విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. కుటుంబ కలహాలతో గత రాత్రి తన వదినపై ఆమె దాడికి ప్రయత్నించింది. అక్కడికి వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ పై కూడా ఆమె దాడి చేసింది. దాంతో కవితతో బాటు, కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వదిన ఫిర్యాదుతో 332, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.