: టీఆర్ఎస్ ఖాతాలో మరో ఎమ్మెల్సీ... మొత్తం మూడు ఏకగ్రీవం


టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్సీ స్థానం చేరింది. ఇప్పటివరకు వరంగల్, ఆదిలాబాద్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మెదక్ ఎమ్మెల్సీ స్థానం కూడా గులాబీ పార్టీనే దక్కించుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థులే ఎన్నికవుతున్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News