: అఫ్రిదికి నోటి దురుసెక్కువ: యువరాజ్ సింగ్
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీకి నోటి దురుసెక్కువని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ తరహాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రారంభించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు మద్దతుగా నిర్వహించిన వీడియో షోలో అఫ్రిదీ సోదరుడు యజమానిగా ఉన్న పెషావర్ జట్టుకు మద్దతుగా యువరాజ్ సింగ్ మాట్లాడాడు. తాను టీమిండియాకు ఆడిన సందర్భంగా అఫ్రిదీ చాలా సార్లు స్లెడ్జింగ్ కు పాల్పడ్డాడని యువీ వెల్లడించాడు. అయినా తాను పట్టించుకునేవాడిని కాదని తెలిపాడు. కానీ, అఫ్రిదీ చూడచక్కని సిక్సర్లు కొడతాడని యువీ కితాబిచ్చాడు. అఫ్రిదీకి మంచి మనసుందని యువీ ప్రశంసించాడు.