: ఇకపై రష్యా శ్మశానాల్లో ఉచిత వై-ఫై!


రష్యాలోని పలు నగరాల్లో ఉన్న శ్మశాన వాటికల్లో ఉచిత వై-ఫై సేవలను అధికారులు అందించనున్నారు. ఈ సేవలను తొలుత వాగన్‌కోవ్‌, ట్రోయెకురొవ్‌, నొవొడెవిచీ శ్మశానవాటికల్లో వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత రష్యా రాజధాని మాస్కోలోని శ్మశాన వాటికల్లో ఈ సదుపాయాన్ని కల్పించున్నారు. అయితే, రాజధాని నగరంలోని మాస్కోలో ఈ ఉచిత వై-ఫై సేవలను ముందుగా అందించకపోవడానికి కారణాలు లేకపోలేదు. వాగన్‌కోవ్‌, ట్రోయెకురొవ్‌, నొవొడెవిచీ శ్మశానవాటికల్లోనే రష్యాకు చెందిన పలువురు ప్రముఖుల సమాధులు ఉన్నాయి. ఇక్కడికి సందర్శకులు తరచుగా వస్తుంటారని.. సమాచారం సేకరిస్తుంటారని మాస్కో శ్మశాన నిర్వహణ సంస్థ ప్రతినిధి లిల్యా ల్వొస్కాయా తెలిపారు. కొంత మంది ఆయా సమాధుల వద్ద నిలబడి ఫొటోలు కూడా దిగుతుంటారని పేర్కొన్నారు. అందుకే.. ఈ శ్మశాన వాటికల వద్ద ముందుగా ఉచిత వై-ఫై సేవలందించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ వై-ఫై సేవలకు లభించే ఆదరణను అనుసరించి మిగిలిన శ్మశాన వాటికలకూ ఈ సదుపాయం కల్పిస్తామని లిల్యా ల్వొస్కాయా తెలిపారు. కాగా, రష్యా దిగ్గజాలైన ప్రముఖ రచయిత ఆంటన్ చెకొవ్‌, సోవియట్ నేత నికిత కృశ్చేవ్, మొదటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ వంటి ప్రముఖుల సమాధులు ఆ శ్మశాన వాటికల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News