: ఎల్ నినో ప్రభావం వల్లే దక్షిణ భారత్ లో భారీ వర్షాలు: ఐరాస నివేదిక
ఇటీవల దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఎల్ నినో ప్రభావంతోనే భారీ వర్షాలు కురిశాయని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులోనూ ఇక్కడ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని తెలిపింది. మధ్య, దక్షిణ భారత్, ఇండోనేషియా, కొలంబియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ పై ఎల్ నినో ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. భారత్ లోని కొన్ని ప్రాంతాలతో బాటు, శ్రీలంకలో కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక అభిప్రాయపడింది.