: ఇళ్ల శంకుస్థాపనను కేటీఆర్ ఎలా చేస్తారు?: షబ్బీర్ అలీ


కొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేయడాన్ని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి, దానం తప్పుబట్టారు. శంకుస్థాపనలో కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని... ముఖ్యమంత్రి కాని, సంబంధిత మంత్రి కాని శంకుస్థాపన చేయాలని... ఐటీ మంత్రి కేటీఆర్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్పారు. కేవలం గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసమే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసం సాగినట్టు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై చర్చించేందుకు వెంటనే శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News