: ఏపీలో రాజధాని ముసుగులో పెద్ద స్కాం జరుగుతోంది: బొత్స


వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ ఎప్పటిలాగే ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి నవ్యాంధ్ర రాజధాని ప్రధానాంశంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణమే జరుగుతోందని ధ్వజమెత్తారు. దాంతో సీమాంధ్ర కాస్తా స్కాముల రాష్ట్రంలా మారుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పంచభూతాలను కూడా కబ్జా చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ బొత్స ప్రశ్నించారు. రాజధానికి సింగపూర్ కంపెనీ ప్రతిపాదనలు నష్టదాయకమని, ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన భూములు ఇస్తారని ప్రశ్నించారు. గతంలోనే తాము సింగపూర్ సంస్థలకు భూముల ప్రతిపాదనను వ్యతిరేకించామని గుర్తు చేశారు. ఇసుక నుంచి ప్రతిదీ కుంభకోణాలమయంగా మారిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News