: మార్చి 19న భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్... వేదిక ధర్మశాల
2016 సంవత్సరానికి గాను టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీల లోగో, షెడ్యూల్ విడుదలైంది. కొద్ది సేపటి క్రితం ఐసీసీ, బీసీసీఐ ప్రతినిధులు టోర్నమెంట్ డ్రాను విడుదల చేశారు. దీని ప్రకారం, మార్చి 19, శనివారం నాడు దాయాదుల మధ్య పోరు జరుగనుంది. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకూ పోటీలు సాగుతాయి. ముంబై, న్యూఢిల్లీల్లో సెమీఫైనల్స్, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ పోటీలు జరుగుతాయి. మొత్తం 58 మ్యాచ్ లు సాగనుండగా, అందులో 27 పోటీలు డే మ్యాచ్ లు. మహిళా టీ-20 పోటీలకు సంబంధించి 23 మ్యాచ్ లు జరుగనున్నాయి.