: ఆదిలాబాదులో టీ టీడీపీని నమ్మించి నట్టేట ముంచిన నారాయణరెడ్డి!
ఆదిలాబాదు జిల్లాలో టీ టీడీపీకి నమ్మక ద్రోహం జరిగింది. పార్టీలో ఉంటూ పార్టీ కీలక నేతలను నమ్మించి ఎమ్మెల్సీ టికెట్ పొందిన నారాయణరెడ్డి చివరి నిమిషంలో గులాబీ గూటికి చేరిపోయారు. టీ టీడీపీ బీ ఫారంతోనే నామినేషన్ వేసిన ఆయన చివరి క్షణంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురాణం సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకున్న మరుక్షణం నారాయణరెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో నామినేషన్ ఉపసంహరణపైనే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న టీడీపీ కీలక నేతలకు గులాబీ కండువా కప్పుకుని నారాయణరెడ్డి మరో షాకిచ్చారు.