: ఎర్రబెల్లికి చుక్కెదురు... ప్రస్తుతానికి కల్పించుకోలేమన్న సుప్రీంకోర్టు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ప్రస్తుతానికి తాము కల్పించుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తలసాని తదితరులు తమ పార్టీకి, పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులను అనుభవిస్తున్నారని, తక్షణం వారి రాజీనామాలు ఆమోదించి, ఎన్నికలు జరిపించాలని కోరుతూ, తెలుగుదేశం నేత ఎర్రబెల్లి కోర్టును ఆశ్రయించగా, కొద్ది సేపటి క్రితం ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారం రాష్ట్ర స్పీకర్ పరిధిలోనిదని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. అయితే, మరో రెండు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే అప్పుడు మరోసారి తమ వద్దకు రావాలని స్పష్టం చేసింది. కాగా, నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు సూచించి 14 నెలలు గడిచినా, స్పీకర్ స్పందించడం లేదని ఎర్రబెల్లి తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.