: ఐఎస్ఐఎస్ ఆదాయ మార్గాలను వెల్లడించిన యూఎస్ అధికారి
పలు దేశాల్లో దాడులు చేస్తున్న ఐఎస్ఐఎస్ ఆదాయ మార్గాలను యూఎస్ టెర్రరిజం, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండర్ సెక్రటరీ అడమ్ జుబిన్ వెల్లడించారు. పలు బ్యాంకులను లూటీ చేసి రూ.బిలియన్ డాలర్లకు పైగా ఐఎస్ఐస్ సంపాదించిందని తెలిపారు. నల్ల బజారులో చమురును అమ్మి ఆరు బిలియన్ డాలర్ల మేర ఆ సంస్థ కూడబెట్టిందని తెలిపారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఇలా ఐఎస్ఐస్ 1.5 బిలియన్ డాలర్లకుపైగా కూడబెట్టిందని చెప్పారు.