: విజయ్ మాల్యాను రెండు రోజుల పాటు ప్రశ్నించిన సీబీఐ... త్వరలో అరెస్ట్?


లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను నిన్న, మొన్న రెండు రోజుల పాటు ఢిల్లీలో సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 900 కోట్ల రుణం తీసుకున్న కేసులో ఆయనను ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం రుణంగా పొందిన ఆ మొత్తాన్ని చట్ట విరుద్ధంగా మారిషస్, కేమేన్ ఐలాండ్ లాంటి దేశాలకు తరలించారనేది మాల్యా మీద ఉన్న అభియోగం. ఈ మొత్తమే కాకుండా వివిధ బ్యాంకుల కన్సార్టియం నుంచి మరో ఏడు వేల కోట్లను కూడా మాల్యా సేకరించారు. మరోవైపు, సీబీఐ విచారణ జరిగిన తీరు చూస్తుంటే... మాల్యాను అరెస్ట్ చేస్తారనే అభిప్రాయం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News