: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు
బీఫ్ ఫెస్టివల్ వివాదంతో తెరపైకి వచ్చి... గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో కనిపిస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బొల్లారం పోలీస్ స్టేషన్ లో పోలీసుల పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు వీడియో దృశ్యాలను పరిశీలించారు. పోలీసులపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించారని అందులో తేలింది. దాంతో రాజాసింగ్ పై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.