: 17 నుంచి వాటాలను అమ్మనున్న 'నారాయణ హృదయాలయ'!


దేశవ్యాప్తంగా 23 ఆసుపత్రులు, 8 హృద్రోగ కేంద్రాలు, 24 ప్రైమరీ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ 'నారాయణ హృదయాలయ' 17వ తేదీ నుంచి ఐపీఓకు రానుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న సంస్థ, విస్తరణ ప్రణాళికలకు అవసరమైన రూ. 613 కోట్ల నిధుల సమీకరణ నిమిత్తం, ఈక్విటీ వాటా ఒక్కింటికి రూ. 245 నుంచి రూ. 250 ప్రైస్ బ్యాండ్ లో వాటాలను విక్రయించనుంది. ప్రముఖ కార్డియాక్ సర్జన్ దేవీ షెట్టి నారాయణ హృదయాలయను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ చైన్ లో షెట్టితో పాటు అశోకా ఇన్వెస్ట్ మెంట్, అంబాదేవీ మారిషస్ కు పెట్టుబడులు ఉండగా, వారంతా తమ వాటాల్లోని పావు వంతును విక్రయానికి ఉంచుతున్నారు. డిసెంబర్ 21తో ముగిసే ఆఫర్ ను యాక్సిస్ కాపిటల్, ఐడీఎఫ్సీ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియాలు నిర్వహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News