: అలా తయారైందో లేదో... ఇలా ఇండియాకు వచ్చేస్తున్న డెంగ్యూ వాక్సిన్!


మెక్సికోలో వాడకానికి అనుమతి పొందిన తొలి డెంగ్యూ వాక్సిన్ 'డెంగావాక్సికా'ను ఇండియాకు తీసుకువచ్చేందుకు సనోఫీ పాశ్చర్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఔషధాన్ని భారత్ లో రిజిస్టర్ చేయనున్నట్టు సనోఫీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఔషధ విభాగం అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే ఇది ఇండియాకు వస్తుందని వివరించారు. ఆరు నెలలకు ఒకసారి చొప్పున మూడు సార్లు ఈ ఇంజక్షన్ తీసుకోవడం ద్వారా డెంగ్యూ బారిన పడకుండా తప్పించుకోవచ్చని ఆయన తెలిపారు. తమ తొలి అధ్యయనాల్లో భాగంగా వివిధ నగరాల నుంచి ఎంపిక చేసిన పెద్దల్లో వాక్సిన్ ను పరీక్షించామని వివరించారు. ఇది సురక్షితమైనదని ఢిల్లీ, లూథియానా, బెంగళూరు, పుణె, కోల్ కతాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో తేలినట్టు చెప్పారు. డెంగ్యూ వైరస్ ను తీవ్రత బట్టి నాలుగు రకాలుగా విభజించగా, అన్ని స్టేజ్ లలోనూ 'డెంగావాక్సికా' సత్ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011లో 18 వేల వరకూ ఉన్న డెంగ్యూ రోగుల సంఖ్య, 2013లో 74 వేలకు పెరిగింది.

  • Loading...

More Telugu News