: రాజ్యసభ నుంచి 23 మంది కాంగ్రెస్, వామపక్ష సభ్యుల సస్పెన్షన్
నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో రాజ్యసభ అట్టుడికింది. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంతగా వారించినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. మరోవైపు లెఫ్ట్ పార్టీల సభ్యలు కూడా అధికార పక్ష వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ నుంచి 23 మంది కాంగ్రెస్, వామపక్ష సభ్యులను కురియన్ సస్పెండ్ చేశారు. అనంతరం సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు.