: మళ్లీ క్రియాశీలకంగా మారనున్న ముఖేష్ గౌడ్


మాజీ మంత్రి, సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ క్రియాశీలకంగా మారనున్నారు. ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం టీపీసీసీ ముఖ్య నేతలు ముఖేష్ గౌడ్ ను కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలనే అంశం కూడా చర్చకు వచ్చిందట. అయితే ముఖేష్ కు గ్రేటర్ బాధ్యతలను అప్పగిస్తారా? లేక పీసీసీలో కీలక పదవి కట్టబెడతారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఒక వేళ నగర బాధ్యతలను ముఖేష్ కు కట్టబెడితే... ప్రస్తుత అధ్యక్షుడు దానం నాగేందర్ కు ఏఐసీసీ లేదా పీసీసీ బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News