: రాష్ట్రపతికి 80 ఏళ్లు నిండాయి... బర్త్ డే విషెస్ తెలిపిన నరేంద్ర మోదీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నేటితో 80 ఏళ్లు నిండాయి. ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న ప్రణబ్ కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులను అలంకరించారు. ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన ప్రణబ్ దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయేవారు. క్షణాల్లో సమస్యకు ముగింపు పలికేవారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రణబ్ రాజకీయాలకు స్వస్తి చెప్పి, దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠంపై కూర్చుకున్నారు. నేడు 80 జన్మదినం జరుపుకుంటున్న ప్రణబ్ కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్... 'దేశానికి దక్కిన వెలకట్టలేని సంపద' అంటూ మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రణబ్ కు ఆయురారోగ్యాలు సిద్ధించాలని మోదీ ఆకాంక్షించారు.