: విజయవాడ మద్యంలో మిథనాల్ కలిపారు!: మంత్రి కామినేని

విజయవాడలో 14 మందిని పొట్టనబెట్టుకున్న మద్యంలో మరింత కిక్కు కోసం మిథనాల్ కలిపారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని తెలిపారు. ఈ విషయం స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల పరీక్షలో వెల్లడైందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. కల్తీ మద్యం ఘటనలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 27 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. బాధితులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత వెంకట్రావు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మరో ఆసుపత్రిలో ఉన్న వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిందని కామినేని వెల్లడించారు.