: చీర కట్టిన టెన్నిస్ స్టార్ ఇవనోవిచ్!
ప్రపంచంలోనే భారతీయ వస్త్రధారణకు ప్రత్యేక స్థానం ఉంది. మగాళ్ల విషయానికొస్తే దేశంలో పలు రకాల వస్త్ర రీతులున్నా, మహిళల విషయానికొస్తే మాత్రం చీర కట్టే భారతీయ వస్త్రధారణ. విదేశాల నుంచి భారత్ వచ్చే పలు రంగాలకు చెందిన మహిళలు ఇక్కడి చీర కట్టుకు ఫిదా అయిపోవాల్సిందే. అంతగా ఆకట్టుకుంటున్న చీర కట్టు టెన్నిస్ స్టార్ అనా ఇవనోవిచ్ ను కూడా కట్టి పడేసింది. ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) పోటీల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఈ సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి నిండైన చీర కట్టుతో ఫొటోలకు ఫోజులిచ్చింది.