: శతచండీయాగంలో ‘చెర్రీ’... భార్యతో కలిసి దోమకొండ గడికోటకు వెళ్లిన టాలీవుడ్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, టాలీవుడ్ యంగ్ స్టార్ రాంచరణ్ తేజ్ నిన్న తన భార్య ఉపాసనతో కలిసి శతచండీయాగంలో పాల్గొన్నాడు. ఇందుకోసం ఆయన నిజామాబాదు జిల్లా దోమకొండ గడికోటకు వెళ్లాడు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో పది రోజులుగా జరుగుతున్న మహారుద్ర శతచండీయాగం నిన్నటితో ముగిసింది. ముగింపు పూజా కార్యక్రమాలకు హాజరైన చెర్రీ దంపతులు దాదాపుగా గంట పాటు అక్కడి పూజాదికాల్లో పాలుపంచుకున్నారు. యాగం ముగింపు పూజల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ తర్వాత చెర్రీ పేర్కొన్నాడు. పనిలో పనిగా దోమకొండ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించాడు. అంతేకాక 16 చెత్త సేకరణ బండ్లను అతడు పంచాయతీకి అందించాడు.