: చిత్తూరు జిల్లాకు రాజ్ నాథ్ సింగ్... తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల సందర్శన
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు ఏపీలోని చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరుపతి సమీపంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ దర్శించుకుంటారు. కేంద్ర హోం శాఖ నుంచి సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం రాజ్ నాథ్ సింగ్ పర్యటన, ఆలయాల సందర్శనకు అన్ని ఏర్పాట్లు చేసింది.