: రికార్డు స్థాయిలో వేములవాడ రాజన్న ఆదాయం!
కరీంనగర్ జిల్లా వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరాజరాజేశ్వర ఆలయ హుండీకి రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గత నవంబర్ 12 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రూ.6.74 కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హుండీ ఆదాయం ఒక కోటి రూపాయలు పెరిగిందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో హుండీ ఆదాయం పెరిగిందన్నారు. కాగా, ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడిని ‘వేములవాడ రాజన్న’గా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు.