: పరారీలో అంబర్ పేట తహశీల్దార్ సంధ్యారాణి!


ఒక ఇంటి నిర్మాణం విషయంలో హైదరాబాద్ మహానగరంలోని అంబర్ పేట తహశీల్దార్ సంధ్యారాణి లంచం డిమాండ్ చేసింది. ఈ సమాచారం తెలుసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం అంబర్ పేట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ ఇంటి నిర్మాణం విషయమై రూ.4 లక్షలు లంచం తీసుకుంటున్న సదరు తహశీల్దార్ సోదరుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. కాగా, తహశీల్దార్ సంధ్యారాణి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News