: సల్మాన్ కేసు తీర్పుపై సోషల్ మీడియాలో సెటైర్లు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసు కొట్టివేతపై సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోయారన్న కారణంతో బాంబే హైకోర్టు సల్మాన్ 'హిట్ అండ్ రన్' కేసును కొట్టివేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో 'సల్మాన్ ఖాన్ తాగి కారు నడపలేదని, కారే మందు కొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింద'ని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ కేసుపై ఇంకో నెటిజన్ వ్యంగ్యం ప్రదర్శిస్తూ '1998లో అనుమానాస్పద పరిస్థితుల్లో లభ్యమైన కృష్ణ జింక ఆత్మహత్య చేసుకుందని ఫోరెన్సిక్ రిపోర్టు'లో వచ్చిందని పేర్కొన్నాడు. 'సల్మాన్ ఖాన్ దానంతట అదే నడిచే కారులో 2002లోనే ప్రయాణించార'ని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, అవును 'గూగుల్ డ్రైవర్ లెస్ కారు కనుక్కోకముందే సల్మాన్ డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించాడ'ని మరొకరు పేర్కొన్నారు. దీనిపై ఇంకో నెటిజన్ మాట్లాడుతూ, 'తప్పు సల్మాన్ ది కాదు, దరిద్రానిదని...నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు సల్మాన్ న్యాయవాదులను నియమించుకోవాల'ని మరో నెటిజన్ సూచించారు.