: చిన్నారులపై కోతుల దాడి... ముగ్గురికి గాయాలు
వరంగల్ జిల్లా హన్మకొండలో కోతులు స్వైర విహారం చేశాయి. స్థానిక పద్మాక్షి కాలనీలోని చిన్నారులు తమ ఇళ్ల ముందు ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా వచ్చిన కోతుల గుంపు చిన్నారులపై పడింది. ఈ సంఘటనలో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. వైద్య చికిత్స నిమిత్తం వీరిని స్థానిక ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై బాధిత చిన్నారుల తల్లిదండ్రులు, స్థానిక వాసులు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా ఉందన్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.