: ప్రభుత్వాన్ని విమర్శించి మూల్యం చెల్లించుకున్న కమలహాసన్!
చెన్నైని వరదలు ముంచెత్తిన సందర్భంగా విమర్శించిన కమలహాసన్ అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఓ మీడియా మిత్రుడికి ఈ మెయిల్ పంపుతూ అందులో వరద బాధితులను ప్రజలు ఆదుకోవడమేంటి? ప్రభుత్వం ఏం చేస్తోంది? పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు ఎక్కడికి చేరుతోంది? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై ప్రజల్లోనూ, అన్నా డీఎంకే పార్టీలోనూ కలకలం రేగింది. కమల్ వ్యాఖ్యలపై ఆరు పేజీల బహిరంగ ప్రకటనతో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం విరుచుకుపడ్డారు. దీంతో ఈ నెల 1 నుంచి 8 వరకు కమల్ హాసన్ ఇల్లు, కార్యాలయం ఉన్న ఆళ్వారుపేటలోని ఎల్డామ్స్ రోడ్డుకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. దీనిపై కమలహాసన్ తాను జయలలితను విమర్శించలేదని, ఓ మిత్రుడికి ఈమెయిల్ ఇచ్చానని వివరణ ఇచ్చారు. దీంతో 8న విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీనిపై స్థానికులు మాత్రం మండిపడుతున్నారు. పెద్దల రాజకీయాలకు తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు.