: దేవుడు కూడా ఆయనకు సహకరించాడు: సల్మాన్ న్యాయవాది
‘దేవుడు కూడా ఆయనకు సహకరించాడు’ అని సల్మాన్ తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ తీర్పు చాలా సంతృప్తికరంగా ఉంది. 13 ఏళ్ల నుంచి సల్మాన్ ఎదుర్కొన్న సమస్యకు ఇది పెద్ద ఉపశమనం. దేవుడు కూడా ఆయనకు సహకరించాడు. తీర్పు పట్ల మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కేసు కొట్టేసినా కోర్టుకు పూచీ కత్తు సమర్పించాలి. కనుక, దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ పాస్ పోర్టును కూడా తిరిగి ఇచ్చేస్తారు’ అని అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.