: చట్టానికి ఎవరూ అతీతులు కాదు: అరుణ్ జైట్లీ
చట్టానికి ఎవరూ అతీతులు కారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆయనీ వ్యాఖ్యలను ఫేస్ బుక్ ద్వారా చేశారు. చట్టానికి సమాధానం చెప్పకుండా ఉండడాన్ని భారత్ అంగీకరించదని అన్నారు. రాణి అయినా సరే చట్టానికి అతీతురాలు కాదని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో పార్లమెంటును అడ్డుకోవడం కాకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు న్యాయస్థానానికి వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కేసును కేంద్రం రాజకీయం చేస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.