: ఎవరెస్టు అధిరోహించిన 31 మంది తెలంగాణ విద్యార్థులు
తెలంగాణకు చెందిన 31 మంది విద్యార్థులు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. వారంతా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతో విద్యార్థులు ఎవరెస్టును అధిరోహించారు. వారిలో గ్రామీణ ప్రాంతాలు, చెంచుగూడెంకు చెందిన 16 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారు.