: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష
తెలంగాణలోని పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారు. పటాన్ చెరు పరిధి పాశ మైలారంలోని ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చనిపోయాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ యాజమాన్యంపై ఎమ్మెల్యే దాడి చేశారని కేసు నమోదైంది. దాన్ని విచారించిన మేజిస్ట్రేట్, మహిపాల్ ను దోషిగా నిర్ధారించారు. ఇందుకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించారు.