: రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వనందుకు అరటితోటను ధ్వంసం చేసిన అధికారులు!
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఇవ్వని తన భూమికి చెందిన అరటితోటను అధికారులు ధ్వంసం చేయడంతో రాజేష్ అనే రైతు లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని లింగాయపాలెంలో జరిగింది. ఈ సంఘటనపై సర్కారు మండిపడుతోంది. ఇందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. వీఆర్వో, వీఆర్ఏ, సూపర్ వైజర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ శ్రీధర్ నిర్ణయం తీసుకున్నారు. లింగాయపాలెం భూ సమీకరణ అధికారిపై అభియోగ పత్రం నమోదు చేసి, ఆయన్ని బదిలీ చేశారు. రైతుకు చెందిన 7.3 ఎకరాల అరటితోట నష్టం అంచనాకు ఉద్యానవన శాఖాధికారులతో సర్వే నిర్వహించి, బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని గుంటూరు జిల్లా అధికారులు ప్రకటించారు.