: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారత్ లో క్రికెట్ మైదానం
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ భారత్ లో క్రీడా మైదానం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ లో క్రికెట్ అభివృద్ధి నిమిత్తం ఆ దేశ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎంవోయూ కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా గ్రేటర్ నోయిడా క్రికెట్ స్టేడియాన్ని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అప్పగించింది. ఈ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఆటగాళ్లు శిక్షణ పొందడంతో పాటు మ్యాచ్ ఆడే వెసులుబాటు కల్పించారు. ఆఫ్ఘనిస్థాన్ లో క్రికెట్ అభివృద్ధికి సహాయం చేయాలని ఆ దేశం గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరింది.